Site icon NTV Telugu

Pooja-Hegde : మరో సౌత్ సినిమా పట్టేసిన పూజా హెగ్డే – బ్యాక్ టు ఫామ్‌లో బుట్టబొమ్మ!

Pojahegde

Pojahegde

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే మళ్లీ తన గ్లామర్‌, టాలెంట్‌ రెండింటినీ చూపిస్తూ బ్యాక్‌ టు ఫామ్‌లోకి వస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్ని ఇండస్ట్రీల్లోనూ టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ బుట్టబొమ్మ, బాలీవుడ్‌లో పెద్ద సక్సెస్ దక్కకపోవడంతో కొంత వెనక్కి తగ్గినా ఇప్పుడు మళ్లీ దూసుకెళ్లే ప్రయత్నం లో ఉంది. ఇటీవల విజయ్ హీరోగా రూపొందుతున్న “జన నాయగన్” సినిమాలో పూజా హీరోయిన్‌గా ఎంపికైందని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. ఈ మూవీ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ సరసన మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతోందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులతోనే పూజా మళ్లీ సౌత్‌ ఫిల్మ్‌ మార్కెట్ ల్లో తన స్థానం పునరుద్ధరించుకుంటోందని అభిమానులు అంటున్నారు.

అంతేకాకుండా, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “కాంచన 4”లో పూజా హెగ్డే హీరోయిన్‌గా  ఎంపికైన విషయం తెలిసిందే. ఈ హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ఎప్పటిలానే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తుండటంతో, పూజా రీఎంట్రీకి ఇది బలమైన పాయింట్‌గా మారే అవకాశం ఉంది. ఇక తాజాగా మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది అదేంటంటే, పూజా హెగ్డే ఇప్పుడు ధనుష్ సరసన కూడా నటించబోతోందట. “అమరన్” సినిమాతో సక్సెస్ సాధించిన రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో పూజా హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు సమాచారం. మొన్నటి వరకు తక్కువ అవకాశాలతో ఉన్నా, ఇప్పుడు వరుసగా నాలుగు పెద్ద సినిమాలను పట్టేసిన పూజా హెగ్డే కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తోందని చెప్పొచ్చు. గ్లామర్‌తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌లోనూ మార్పులు తీసుకువస్తూ, ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ అందాల భామ, 2025లో మళ్లీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఎక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version