NTV Telugu Site icon

Ponniyin Selvan 2: మొదటి పార్ట్ కన్నా తక్కువే… అయినా ఇండస్ట్రీ హిట్

Ponniyin Selvan 2

Ponniyin Selvan 2

మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ జరుపుకోని, ఈ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 2’. కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్, ఐశ్వర్యల సీన్ కి మంచి రీచ్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సీన్ గురించే చర్చ జరుగుతూ ఉండడంతో అసలు ‘ఆదిత్య కరికాలన్’, ‘నందినీ’ల మధ్య ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో కలెక్షన్స్ లో గ్రోత్ కనిపిస్తోంది. తమిళులు ఎక్కడ ఉన్నా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఇతర ఇండస్ట్రీల్లో కూడా PS-2కి మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ లో జోష్ అంతగా కనిపించట్లేదు. తెలుగు తప్ప మిగిలిన ప్రాంతాల్లో PS-2 ఇంపాక్ట్ కనిపించట్లేదు.

ఓవర్సీస్ లో ప్రిమియర్స్ అండ్ డే 1 కలిపి 1.6 మిలియన్ డాలర్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ మొదటిరోజు 62 కోట్లని కలెక్ట్ చేసింది. ఇది కోలీవుడ్ లో 2023కి టాప్ గ్రాసింగ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. గతేడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా మొదటి రోజు 80 కోట్లని రాబట్టింది. పార్ట్ 2కి పార్ట్ 1కి మధ్య దాదాపు 18 కోట్ల తేడా ఉంది. వీక్ ప్రమోషన్స్ ఏ పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడానికి కారణం. పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి ఇకపై పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్ లో మంచి బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ రన్ మైంటైన్ చేస్తే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా  పార్ట్ 1 కలెక్షన్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

Show comments