Site icon NTV Telugu

Polimera 2 Teaser: పొలిమేర టీజర్.. చేతబడితోనే ప్యాంట్ తడిచేలా భయపెట్టేస్తున్నారు కదయ్యా

Polimera

Polimera

Polimera 2 Teaser: ప్రస్తుతం టాలీవుడ్ లో చేతబడుల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఏడాది రిలీజైన విరూపాక్ష సైతం చేతబడులు నేపథ్యంలోనే తెరకెక్కిన విషయం తెల్సిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చేతబడుల నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే మా ఊరి పొలిమేర 2 . కరోనా సమయంలో పొలిమేర.. ఓటిటీలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సత్యం రాజేష్, బాలాదిత్య, సాయి కామాక్షి, సాహితీ దాసరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు. 2021 లో రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రెండేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం భయపెట్టిస్తోంది.

Mega Princess: పిక్ ఆఫ్ ది డే.. వారసురాలిని చూసి మురిసిపోతున్న మెగా కుటుంబం

మొదటి పార్ట్ చివరిలో సత్యం రాజేష్ చనిపోయినట్లు చూపించారు. అతడిని వెతకడానికి తమ్ముడు బాలాదిత్య వెతుకుతూ ఉంటాడు. ప్రియురాలితో కేరళ పారిపోయిన సత్యం రాజేష్.. అక్కడ కూడా చేతబడులు చేయడం మొదలుపెడతాడు. ఇక కేరళలో వరుస హత్యలు.. పోలీస్ కేసులు.. అన్నాను వెతుక్కుంటూ బాలాదిత్య కేరళ వస్తాడా..? ఈ పార్ట్ లోనైనా సత్యం రాజేష్ చేతబడులకు ముగింపు పలుకుతాడా..? అనేది చూడాలి. టీజర్ మొత్తాన్ని ఒక్క డైలాగ్ తో చెప్పేశారు. ప్రాణం తీయడం తప్పు కదా.. అని ఒక మహిళ అంటే.. ” ప్రాణం తీయడం తప్పు.. బలి ఇవ్వడంలో తప్పేంటి” అని ఒక వృద్ధుడు మాట్లాడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ మొత్తం చేతబడులతో నింపేశాడు. టీజర్ తోనే భయపెట్టేసాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను ప్యాంట్ తడిచేలా భయపెట్టించడం ఖాయం అనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version