NTV Telugu Site icon

Shekhawat Loolalike: రోడ్డెక్కిన షికావత్ సార్ కి పోలీసులు వార్నింగ్

Pushpa Lookalie

Pushpa Lookalie

బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’లో ప్రధాన పాత్రధారి పుష్పాకి విలన్ గా నటించిన పోలీస్ ఆఫీసర్ ‘షెకావత్’ సార్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ‘షెకావత్’ సార్ వేషంలో కానిస్టేబుల్ యూనిఫాంలో సిగరెట్ తాగుతూ కనిపించారు. విశేషమేమిటంటే సినిమాలోని ఎస్పీ షెకావత్ పాత్ర నుండి ప్రేరణ పొంది తన కొత్త స్టైల్‌లో కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్ తన్వర్, ఇతను మధ్యప్రదేశ్ పోలీస్‌లో కానిస్టేబుల్‌ అని తెలుస్తోంది.

Samyuktha Menon: క్రేజియస్ట్ హీరోయిన్ సంయుక్త మీనన్.. చేతిలో అన్ని సినిమాలున్నాయా?

సినిమా క్యారెక్టర్ ఎస్పీ షెకావత్ లాగా తన లుక్ మార్చుకున్నాడు. మీసాలు మరియు హెయిర్‌స్టైల్‌తో షెకావత్ రూపాన్ని అడాప్ట్ చేస్తూ, తన్వర్ యూనిఫాంలో, సిగరెట్ తాగుతూ, సినిమా డైలాగ్‌లకు నటిస్తూ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 22 మిలియన్లకు పైగా వీక్షించారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు చాలా కామెంట్స్ చేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న ఇండోర్ పోలీసులు రీల్ చేసిన వారిని స్టేషన్‌కు రప్పించారు. కంటెంట్ కోసం ఇలా చేయడం మంచిదే కానీ, ఓ పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా సిగరెట్ తాగుతున్నట్లు వీడియో తీయటం వల్ల డిపార్ట్మెంటు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు.