Police permission rejected to Guntur Kaaram Pre-Release Event: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన “గుంటూరు కారం” సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఈరోజు హైదరాబాద్ యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్ లో ఈవెంట్ జరుపుకుంటామని మేకర్స్ పర్మిషన్ అడగ్గా హైదరాబాద్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. నిన్న చివరి క్షణం వరకు ఈవెంట్ జరపాలని ప్రయత్నాలు చేసినా ఏమీ వర్కౌట్ కాకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఇక రేపు జరపాలని అనుకుని ప్రయత్నాలు చేసినా హనుమాన్, వెంకటేష్ సినిమాల ఈవెంట్స్ ఉండడంతో కరెక్ట్ కాదని ఆగారు. ఇక ఈ క్రమంలో జనవరి 9వ తారీఖు నాడు “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ లేటెస్ట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్రయత్నాలు చేసింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.
Devara Glimpse: ఆ రక్తపు అలలు ఏంటయ్యా? హైపెక్కించి చంపేస్తారా?
అయితే నిజానికి యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్ లో ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్ అని తెలుస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ కప్ తీసుకున్న రోజున పెద్ద రాద్ధాంతమే జరిగింది. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ వంటి వార్ల కార్ల మీద దాడి, 6 ఆర్టీసీ బస్సుల మీద దాడి జరిగింది. అంతేకాక ర్యాలీ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగి పోలీసులు కేసులు పెట్టి పల్లవి ప్రశాంత్ ను జైలుకు కూడా పంపాల్సి వచ్చింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ రోడ్డు ఎక్కితేనే అభిమానం పేరుతో ఇంత రచ్చ చేశారు, అదే మహేష్ అభిమానులు కూడా అలా బిహేవ్ చేస్తే ఇబ్బంది అవుతుందని పోలీసులు వెనకడుగు వేసినట్టు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాల్సి ఉంది. ఇక సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు కూడా సమయం లేదని ఒకపక్క ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ అయినా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ట్రైలర్ రేపు అంటే 7న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత 9న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని అనుకుంటున్నారు.