NTV Telugu Site icon

Puneeth Rajkumar Last Film: పునీత్ చివరి సినిమాపై ప్రధాని మోదీ ట్వీట్.. అప్పు భార్య రిప్లై ఇదే..!!

Puneeth Rajkumar Pm Narendra Modi

Puneeth Rajkumar Pm Narendra Modi

PM Modi’s tweet on Puneeth Rajkumar’s last film: దివంగత సినీ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘ గంధాడ గుడి’పై ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గంధాడ గుడి సినిమా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది మరణించిన కన్నడు నటుడు పునీత్ రాజ్ కుమార్ ను స్మరిస్తూ.. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా పునీత్ రాజ్ కుమార్ భార్య రీట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ లో ‘‘ అప్పు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాల్లో జీవిస్తున్నారని.. అతను అద్భుతమైన వ్యక్తిత్వం, శక్తితో నిండి ఉన్నాడు. అప్పు(పునీత్ రాజ్ కుమార్) అసమానమైన ప్రతిభతో ఆశీర్వదించబడ్డాడని.. గంధాడ గుడి ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యారణానికి నివాళి అని.. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు’’ అని రాశారు.

దీనికి ప్రతిగా పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్ కుమార్ ట్వీట్ చేశారు. ‘‘ నమస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ రోజు మాకు ఎమోషనల్ డే అని..మేము గంధడ గుడి ట్రైలర్ విడుదల చేస్తున్నామని.. ఇది అప్పు హృదయానికి దగ్గరగా ఉంటుందని.. అప్పు ఎల్లప్పుడు మిమ్మల్ని కలవడాన్ని ఆదరించేవాడదని.. వ్యక్తిగతంగా మీరో అన అభిప్రాయాలను పంచుకోవడాన్ని ఇష్టపడే వారని’’ అశ్విని పునీత్ కుమార్ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో పునీత్ రాజ్ కుమార్, ప్రధాని మంత్రి మోదీతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. అప్పు మన మధ్య లేదు, కానీ అతని జీవితం, అతను చేసిన పని ‘వసుధైవ కుటుంబకం’ సంస్కృతిని స్వీకరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది,శక్తిని ఇస్తుందని.. గంధాడ గుడి భూమి గొప్ప వారసత్వం, సంస్కృతి, స్వభావం, వైవిధ్యానికి అద్ధం పడుతుందని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతికి ఒక రోజు ముందు అక్టోబర్ 28న గంధాడ గుడి సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

కన్నడ నాట పవర్ స్టార్ గా, దిగ్గజ సినీనటుడు రాజ్ కుమార్ కొడుకుగా పునీత్ రాజ్ కుమార్ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఓ నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. సొంత డబ్బులో స్వచ్ఛందంగా సేవ చేశారు. గతేడాది బెంగళూర్ లోని ఇంట్లో జిమ్ చేస్తూ..హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు పునీత్ రాజ్ కుమార్. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన యావత్ కర్ణాటకను శోకసంద్రంలో ముంచింది. పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేక కొంతమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత రిలీజ్ అయిన ‘ జేమ్స్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ‘ గంధాడ గుడి’ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

Show comments