Site icon NTV Telugu

Narendra Modi: చిరంజీవిపై మోడీ ప్రశంసల వర్షం..

Chiru

Chiru

Narendra Modi: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైన విషయం విదితమే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా ప్రధాని మోడీ సైతం చిరుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా మోడీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. “చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు.. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవలే అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇందులో 79 దేశాల నుంచి 280 సినిమాలను ప్రదర్శించనున్నారు. చిత్ర పరిశ్రమలో చిరంజీవి చేసిన గొప్ప సేవలకుగాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు చిరుకు దక్కింది. త్వరలోనే చిరు ఈ అవార్డును అందుకోనున్నారు.

Exit mobile version