Pizza 3 Streaming in Amazon Prime Video: ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో విడుదలైన సినిమా ఓటీటీలోకి రావడానికి కొంత సమయం పడుతోంది. మినిమమ్ నెల గ్యాప్ లేకుండా సినిమాలో ఓటీటీలో రిలీజ్ అవడం లేదు. అయితే అనూహ్యంగా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది లేటెస్ట్ హారర్ మూవీ. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంటుగా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో చెప్పలేదు కదా అదేనండీ ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో అశ్విన్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్స్ లో విడుదలై తమిళంలో పర్వాలేదనిపించుకున్నా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘పిజ్జా’ అనే సినిమాకి ఇది మూడవ భాగం కాగా తిరు కుమార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సివి కుమార్ నిర్మించారు. థియేటర్లో విడుదలై వారం రోజులు అవకముందే ఓటీటీలో రావడం గమనార్హం.
Adah Sharma: స్టార్ హీరో సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ కొనుక్కున్న ఆదా శర్మ?
ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 25 నుంచే అంటే నిన్నటి నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేయడం విశేషం. ఇక తెలుగుతో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సో థియేటర్లో ఈ సినిమాని చూడని వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చూసేసి భయపడవచ్చని చెబుతున్నారు సినిమా చూసిన వారు. కనెక్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి సంస్థ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గౌరవ్ నారాయణ్, అభిషేక్ శంకర్, కాళీ వెంకట్, అనుపమ కుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా అశ్విని హేమంత్ సంగీతం అందించారు. సినిమాలో నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పక తప్పదు.