Pindam Movie Release Date Fixed: ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న ‘పిండం‘ ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక మొన్న దీపావళి కానుకగా చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సినిమా ఎలా ఉండబోతుంది, చిత్రీకరణ ఎలా సాగింది అని వివరించడం హాట్ టాపిక్ అయింది. ఆ వీడియోలో మేకింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు. ఇక తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Karthik Subbaraj: హీరోయిన్ బాలేదన్న రిపోర్టర్… దిమ్మతిరిగే షాకిచ్చిన కార్తీక్ సుబ్బరాజ్
ఇక ఈ సినిమా గురించి శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, “పిండం అనేది స్ట్రయిట్, క్లియర్, సీరియస్ హారర్ జానర్ సినిమా అని అన్నారు. మామూలుగా కొన్ని హారర్ సినిమాల్లో సాంగ్స్, కామెడీ ట్రాక్ లు ఉంటాయి. అలాంటివేం లేకుండా మిమ్మల్ని భయపెట్టడం కోసం తీసిన స్ట్రయిట్ హారర్ ఫిల్మ్ ఇదని, థియేటర్లలో మీకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. డైరెక్టర్ సాయికిరణ్ దైద మాట్లాడుతూ ఒక నిజ జీవిత ఘటనను తీసుకొని నేను, నా సహ రచయిత కవి సిద్ధార్థ కలిసి అద్భుతమైన కథగా మలిచామని అన్నారు. నేను దెయ్యాలు గురించి చెప్తే భయపడే మనిషిని కాదు కానీ, ఈ కథ నన్ను కొంచెం భయపెట్టిందని అన్నారు. షూట్ లో కుడా మాకు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. సినిమా కోసం ఒక పాపను ఎంపిక చేస్తే వాళ్ళ అమ్మ చనిపోవడం, లైట్ మ్యాన్ కింద పడటం సహా పలు సంఘటనలు జరిగాయని , అవన్నీ గుర్తొచ్చి ఒక్కోసారి రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదన్నారు.