NTV Telugu Site icon

Love Today: సూపర్ హిట్ సినిమా రీమేక్ కి రంగం సిద్ధం…

Love Today

Love Today

సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వడం అనేది ఎన్నో ఏళ్లుగా తరచుగా జరుగుతున్నదే. తమిళ్, తెలుగు, మలయాళ హిట్ సినిమాల రైట్స్ ని హిందీ హీరోలు, నిర్మాతలు కొని నార్త్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పైన రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. కార్తీ ఖైదీ సినిమాని జయ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని ‘సెల్ఫీ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. రిలీజ్ కి రెడీగా ఈ రెండు సినిమాల్లాగే మరో చిన్న బడ్జట్ సూపర్ హిట్ సినిమా హిందీలో వెళ్తోంది. ప్రదీప్ రంగనాధన్, ఇవాన హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ టుడే’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తమిళనాడులో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ 70 కోట్లకి పైగా రాబట్టి సెన్సేషనల్ హిట్ గా పేరు తెచ్చుకుంది.

Read Also: Ajay Devgn: ఖైదీ రీమేక్ లోకి అమలా పాల్ వచ్చిందే…

ప్రేమించుకున్న ఒక జంట, తమ ఫోన్స్ మార్చుకుంటే వచ్చే ఇబ్బందిని ప్రదీప్ రంగనాధన్ సూపర్బ్ గా చూపించాడు. యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన లవ్ టుడే సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు దిల్ రాజు. తెలుగులో కూడా లవ్ టుడే సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టి ఇక్కడ కూడా హిట్ అయ్యింది. రెండు సౌత్ భాషల్లో హిట్ అవ్వడంతో హిందీ చిత్ర పరిశ్రమ దృష్టి లవ్ టుడే సినిమాపై పడింది. ఈ మూవీని రీమేక్ చేస్తున్నట్లు ‘ఫాంతమ్’ స్టూడియో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. తమిళ ప్రొడ్యూసర్స్ ‘AGS ప్రొడక్షన్స్’తో కలిసి ‘ఫాంతమ్’ లవ్ టుడే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. నటీనటులు ఎవరు? దర్శకత్వం ఎవరు వహిస్తారు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments