Perfume Movie Pre Release Event: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు ఏ సినిమా రాకపోగా అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘పర్‌ఫ్యూమ్’ అనే చిత్రం రాబోతోంది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించగా జే.డి. స్వామి డైరెక్ట్ చేశారు. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మిస్తుండగా అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించగా ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌ను యూనిట్ ఘనంగా సత్కరించింది.
Tiger 3: టైగర్ 3 దెబ్బకి తమిళ సినీ పరిశ్రమలో కల్లోలం
ఈ క్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు 3700 పాటలు రాశా, ఈ రోజు నా గురించి, నా మీద పాట రాశారు, పాడారు. నాకు బహుమతిగా ఆ పాటను ఇచ్చిన టీంకు థాంక్స్, ఆస్కార్ వచ్చిన ఆ మూమెంట్‌ను మళ్లీ చూడటంతో ఎమోషనల్ అయ్యా. జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు, నేను రాసిన పాటకు ఎంతో చక్కటి బాణీలను అజయ్ అందించారు. ఆచార్య ఆత్రేయ పాటలు, శైలి, రీతి, ప్రవర్తనే నా జీవితంలో పరిమళం అని దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలి’ అని అన్నారు. డైరెక్టర్ జే.డి. స్వామి మాట్లాడుతూ.. ‘కొత్తదనం, కొత్త పాయింట్‌తో సినిమా చేస్తే కచ్చితంగా మంచి ప్రతిఫలం వస్తుందని, ఆ సుగంధం కచ్చితంగా వ్యాపిస్తుంది. నా గురువు చంద్రబోస్ గారే నాకు స్ఫూర్తి, నవంబర్ 24న మా చిత్రం రాబోతోంది, అందరూ థియేటర్లో చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.