King of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ అనే కాకుండా అన్ని వుడ్స్ లో కూడా తన సత్తా చాటుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా దుల్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోథా. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీతో సహా ఐదు భాషలలో పాన్-ఇండియా లెవల్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలను అన్ని పరిచయం చేస్తూ.. సాగిన ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకొంటుంది.
Gunturu Kaaram: బ్రేకింగ్.. పూజా ప్లేస్ లో మీనాక్షి..?
కన్నన్, ఐశ్వర్య లక్ష్మి, నీల ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, ఇలా వీరి పాత్రలను.. ఆర్ట్ రూపంలో చూపించారు. ఇక చివరగా.. కింగ్ ఆఫ్ కోథా గా దుల్కర్ సల్మాన్ ను పరిచయం చేశారు. మోషన్ పోస్టర్ కు హైలైట్ అంటే.. జాక్స్ బిజోయ్ మ్యూజిక్ అనే చెప్పాలి. దుల్కర్ చుట్టూ జనాలు.. మధ్యలో దుల్కర్ బ్యాక్ ను చూపించి అంచనాలను పెంచేశారు.ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పీపుల్ ఆఫ్ కోథా గా వీరిని పరిచయం చేశారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ గ్యాంగ్ స్టర్ గా మారిన పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడట. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ మలయాళ హీరో ఈ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తాడేమో చూడాలి.
