Site icon NTV Telugu

Raviteja: మాస్ మీటింగ్ కి మహారాజా ఫాన్స్ రెడీ అవ్వండి..

Dhamaka

Dhamaka

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చెయ్యడంతో మాస్ మహారాజా రవితేజ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. రెండు సినిమాలతో వచ్చిన నెగటివ్ టాక్ ని కేవలం మూడు రోజుల్లోనే పాజిటివ్ గా మార్చేస్తూ, నీరసంగా ఉన్న రవితేజ ఫాన్స్ ని యాక్టివ్ చేస్తూ ‘ధమాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ కనుకుగా విడుదలైన ఈ మూవీ రవితేజ ఫాన్స్ లోనే కాదు సినీ అభిమానులందరిలోనూ జోష్ నింపింది. సింగల్ స్క్రీన్స్ లో ధమాకా సినిమా చూస్తే ఈ అరుపులు, ఈలలు, గాల్లోకి లేచిన పేపర్లని చూసి ఎన్ని రోజులు అయ్యిందో అనిపించకమానదు. రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని రాబడుతున్న ధమాకా సినిమా మండే టెస్ట్ ని సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యింది. అన్ని సెంటర్స్ లో మంచి ఫుట్ ఫాల్స్ పడుతుండంతో ధమాకా సినిమాకి హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 32 కోట్లు రాబట్టిన ఈ మూవీ సక్సస్ మీట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్.

Read Also: Dhamaka: క్రాక్ రికార్డులకి ‘ధమాకా’ చెక్…

ఈ మధ్య కాలంలో మార్నింగ్ షో అయిపోగానే సక్సస్ సెలబ్రేషన్స్ చేస్తుంటే… ధమాకా మేకర్స్ మాత్రం వారం రోజుల తర్వాత సక్సస్ మీట్ చేస్తున్నారు. నిజమైన సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్న మేకర్స్, తమకి అంత మంచి హిట్ ఇచ్చినందుకు రవితేజ ఫాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ‘మాస్ మీటింగ్’కి ఏర్పాట్లు చేస్తున్నారు. JRC కన్వెన్షన్ లో డిసెంబర్ 29న సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ మాస్ మీట్ జరగనుంది. ఈ విషయన్ని అనౌన్స్ చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఘనంగా జరగనున్న ఈ మాస్ మీట్ లో రవితేజ, శ్రీలీలతో పాటు ధమాకా చిత్ర యూనిట్ అంతా పాల్గొనబోతున్నారు.

Read Also: Dhamaka: ఈడు నిజంగానే మాస్ మహారాజా ఎహే…

Exit mobile version