Site icon NTV Telugu

RC 16 : రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్.. హ్యాట్సాఫ్ టు బుచ్చి

Ram Charan 16

Ram Charan 16

గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు.  భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్‌ ను విశేశంగా ఆకట్టుకుంది. రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌‌లో రేపు రామ్ చరణ్అదరగొట్టాడు. కాగా నేడు శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ది ఫస్ట్ షాట్ డైరెక్ట్ సిక్సర్ అనే చెప్పాలి. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ గూస్ బమ్స్ తెప్పించాయి. బుచ్చి బాబు టేకింగ్ నెక్ట్స్ లెవల్. ఓవరాల్ గా పెద్ది ఫస్ట్ షాట్ సూపర్ సిక్సర్. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను ఫ్యాన్స్ కోరుకునే విధంగా  చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్  జెట్ స్పీడ్ లో జరుగుతుంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version