Peddi Success Meet: ‘పెద్ది’ సక్సెస్ వేడుకకు మెగా సర్ప్రైజ్.. స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Success Meet : భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకు సక్సెస్ వేడుక మరింత ప్రత్యేకంగా ఉండాలంటే అభిమానులకు సర్ప్రైజ్లు కూడా అవసరమే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ టీమ్ కూడా అలాంటి గ్రాండ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ వేడుకకు రానున్న స్పెషల్ గెస్ట్ ఎవరనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ కెరీర్లో మరో విభిన్నమైన పాత్రగా నిలిచిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, బుచ్చి బాబు టేకింగ్, రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలైన తొలి రోజునుంచే మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ విజయపథంలో దూసుకెళ్తోంది.
Also Read
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
ఈ విజయాన్ని అభిమానులతో కలిసి జూన్ 23న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి “మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్” పేరిట సెలబ్రేట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథి హాజరుకానున్నారని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే ఆ అతిథి ఎవరో మాత్రం ఇప్పటివరకు గోప్యంగానే ఉంచారు. అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్లో కీలక చిత్రంగా నిలుస్తున్న ‘పెద్ది’ విజయాన్ని మెగాస్టార్ స్వయంగా అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసే అవకాశం ఉందనే వార్తలు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!