Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే

Tollywood (1)

Tollywood (1)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఒక రోజు ముందే ఓవర్సీస్ మరియు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయి  ప్రేక్షకులనుండి  మిశ్రమ ఫలితం రాబట్టింది.

 ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉందని చెర్రీ తన అద్భుతమైన నటనతో వన్ మ్యాన్ షోగా ‘పెద్ది’ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టాడని ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా నటన పరంగా రామ్ చరణ్ జాతీయ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించాడని ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాలో వచ్చే క్రికెట్ మరియు కుస్తీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. దర్శకుడు బుచ్చిబాబు ఎంచుకున్న కథ మరియు పాయింట్ చాలా బలంగా ఉన్నప్పటికీ ఎమోషనల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ చేయడంలో తేడా కొట్టింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు కేవలం రామ్ చరణ్ పాత్ర పైనే కాకుండా మిగతా అంశాల పైన లవ్ ట్రాక్ పైన కూడా కాస్త ఫోకస్ చేసి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదనే కామెంట్స్ వస్తున్నాయి. థియేటర్ నుంచి బయటిక వచ్చే ప్రేక్షకుడి హృదయాల్లో పెద్దిగాడు ఉండిపోతాడో లేదో పక్కన పెడితే సినిమాలో వచ్చే ఒకే ఒక్క డైలాగ్ మాత్రం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అదే.. “ఏదైనా ఇప్పుడే చేసేయాలి.. మళ్ళీ పుడతామా ఏంటి” అని చరణ్ చెప్పే విధం ప్రతి ఒక్కరి నిజ జీవితానికి ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. జీవితంలో ఏది చేయాలన్నా ఏం సాధించాలన్నా బతికున్నప్పుడే చేయాలనే సందేశాన్ని ఈ డైలాగ్ బలంగా చాటిచెప్పింది.

×
×
Ad