Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది‘. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఒక రోజు ముందే ఓవర్సీస్ మరియు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులనుండి మిశ్రమ ఫలితం రాబట్టింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉందని చెర్రీ తన అద్భుతమైన నటనతో వన్ మ్యాన్ షోగా ‘పెద్ది’ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టాడని ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా నటన పరంగా రామ్ చరణ్ జాతీయ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించాడని ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాలో వచ్చే క్రికెట్ మరియు కుస్తీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. దర్శకుడు బుచ్చిబాబు ఎంచుకున్న కథ మరియు పాయింట్ చాలా బలంగా ఉన్నప్పటికీ ఎమోషనల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ చేయడంలో తేడా కొట్టింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు కేవలం రామ్ చరణ్ పాత్ర పైనే కాకుండా మిగతా అంశాల పైన లవ్ ట్రాక్ పైన కూడా కాస్త ఫోకస్ చేసి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదనే కామెంట్స్ వస్తున్నాయి. థియేటర్ నుంచి బయటిక వచ్చే ప్రేక్షకుడి హృదయాల్లో పెద్దిగాడు ఉండిపోతాడో లేదో పక్కన పెడితే సినిమాలో వచ్చే ఒకే ఒక్క డైలాగ్ మాత్రం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అదే.. “ఏదైనా ఇప్పుడే చేసేయాలి.. మళ్ళీ పుడతామా ఏంటి” అని చరణ్ చెప్పే విధం ప్రతి ఒక్కరి నిజ జీవితానికి ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. జీవితంలో ఏది చేయాలన్నా ఏం సాధించాలన్నా బతికున్నప్పుడే చేయాలనే సందేశాన్ని ఈ డైలాగ్ బలంగా చాటిచెప్పింది.
Also Read
- Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!