Site icon NTV Telugu

Ram Charan : కెరీర్ హయ్యెస్ట్ ధరకు’పెద్ది ‘ మ్యూజిక్ రైట్స్ డీల్ క్లోజ్..

Rc16

Rc16

గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తుండగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఇటీవల చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు భారీ స్పందన లభించింది.

Also Read : Vijay : భారీ ధర పలికిన విజయ్ జననాయగాన్ శాటిలైట్ రైట్స్

ప్రస్తుతం షూటింగ్ దశలోన్ ఉన్న ఈ సినిమా రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా పెద్ది మ్యూజిక్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ పెద్ది మ్యూజిక్ రైట్స్ ను రూ. 35 కోట్లకు కొనుగోలు చేసింది. చెప్పాలంటే ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ధర. కనీసం ఈ సినిమా గ్లిమ్స్ కూడా బయటకు రాకుండా ఈ రేంజ్ బిజినెస్ అంటే ఈ కాంబోకున్న క్రేజ్ ఏంటో చెప్పొచ్చు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ శ్రీరామనవమి కానుకగా ఈ నెల 6న ఆదివారం నాడు రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ లోను పాజిటివ్ బజ్ నడుస్తోంది. స్పోర్ట్స్ కథానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version