Ananta Sriram: ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ విమర్శలపై ఇచ్చిపడేసిన అనంత శ్రీరామ్.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’!

Peddhi

Peddhi

Ananta Sriram: సినిమా ఇండస్ట్రీలో ఒకే ఆల్బమ్‌లో అన్ని రకాల పాటలు రాసే అవకాశం దక్కడం ఏ రచయితకైనా చాలా అరుదుగా వచ్చే అదృష్టం. తాజాగా ‘పెద్ది’ సినిమా క్రేజీ ఆల్బమ్‌తో అలాంటి అరుదైన అవకాశాన్ని అందుకున్నారు ప్రముఖ సినీ గేయరచయిత అనంత శ్రీరామ్. అయితే, ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు ఒకెత్తయితే.. అందులోని ఒక ‘ఐటమ్ సాంగ్’ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకవైపు ఈ పాట మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటే.. మరోవైపు ఈ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా నిర్వహించిన పెద్ది సినిమా సక్సెస్‌మీట్‌లో అనంత శ్రీరామ్ తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్లకు మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చారు.

తన పాటపై వస్తున్న విమర్శలను అనంత శ్రీరామ్ అస్సలు లైట్ తీసుకోలేదు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. “ఐటమ్ సాంగ్‌ను ఐటమ్ సాంగ్‌లా ఆస్వాదించిన వాళ్లకు మేము ఒక స్పెషల్ రుచి చూపించాం. అలా కాకుండా దాన్ని ఐటమ్ సాంగ్‌లా ఎంజాయ్ చేయకుండా విమర్శించే వాళ్లు ఉన్నారే.. వాళ్లే అసలైన ‘ఐటమ్ గాళ్లు’ కింద లెక్క!” అని గట్టి కౌంటర్ ఇచ్చారు. సమీక్షలు, ఆరోపణలు అనేవి నిర్దిష్టంగా ఉండాలని.. ఏదో లోపల ఉన్న భావోద్వేగాన్ని అరిచేయడానికో, లేదా ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని బురద చల్లడానికో మాట్లాడితే తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాత్వికంగా ఆలోచించి, తార్కికంగా మాట్లాడుతూ.. ఫలానా వాక్యం తప్పని నిర్దిష్టంగా నిలదీస్తే, నికార్సైన సమాధానం ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని సవాల్ విసిరారు.

×
×
Ad

సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు హద్దులు మీరుతూ అనంత శ్రీరామ్‌పై పర్సనల్ అటాక్ చేశారు. కామెంట్ సెక్షన్లలో ‘దొంగనా కొడకా’ అంటూ బూతులు కూడా వాడారు. దీనిపై యాంకర్ ప్రశ్నించగా.. అనంత శ్రీరామ్ ఎంతో కూల్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా స్పందించారు. “ఆ తిట్లను చూశారా?” అని యాంకర్ అడగగా.. “‘దొంగనా కొడుకు’ అనేది తిట్టే కదా.. దానికి సమాధానం నేను రాసిన ఈ పాటలోని చరణమే” అంటూ ఒక అద్భుతమైన లైన్‌ను ఆయన పాడి వినిపించారు. “ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా ఏదిద్దేటట్టు నేనొట్టు పెట్టనా.. నాకు ఏ రోజునో నీ రాజనం పట్టేదా.. నిందా నా కట్టె కాలేలోగా!” ఈ లైన్స్ ద్వారా తనను నిందించే వాళ్లకు కవితాత్మకంగానే బలమైన సమాధానం ఇచ్చారు. ఒక స్పెషల్ సాంగ్ రాసేటప్పుడు ఒక రచయితగా ఎలాంటి బౌండరీస్ (హద్దులు) పెట్టుకుంటారు? అనే ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చారు. “రచయిత అనేవాడు అవ్వాలంటేనే వాడికి అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. కేవలం ఆలోచనా శక్తి, ఊహా శక్తి మాత్రమే రచయితకు అవధులు” అని చెప్పుకొచ్చారు.