Site icon NTV Telugu

Payal Rajput: ఆ సీతాకోక చిలుక ఎంత బాగుందో…

Payal Rajput

Payal Rajput

ఆర్ ఎక్స్ 100 సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన క్యారెక్టర్ ‘ఇందు’ది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ కి నెగటివ్ క్యారెక్టర్ ఇచ్చిన సినిమా బయటకి రాలేదు. ఎక్కువగా అమ్మాయిలని మోసం చేసిన అబ్బాయిలే సినిమాల్లో కనిపిస్తారు, ఈ ట్రెండ్ కి బ్రేక్ ఇచ్చి ఆర్ ఎక్స్ 100 సినిమాని తెరకెక్కించాడు అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. టాలీవుడ్ కి మరో రామ్ గోపాల్ వర్మ అవుతాడని అందరూ అనుకుంటున్న సమయంలో అజయ్ భూపతి ‘మహా సముద్రం’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహా సముద్రం సినిమా ఫ్లాప్ అవ్వడంతో అజయ్ భూపతి క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతినింది. ఈ నెగటివ్ కామెంట్స్ ఎక్కువ అవ్వడంతో అజయ్ భూపతి కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ అనే సినిమా చేస్తున్నాడు.

Read Also: Agent: ‘ఏజెంట్’ సెన్సార్ టాక్.. బుల్లెట్ల వర్షమే!

తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే బయటకి వచ్చింది. బటర్ఫ్లై ని తలపించేలా డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక అమ్మాయి నిలబడి ఉంది, ఆ అమ్మాయిని చాలా కళ్ళు చూస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో తాను లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాను అనే క్లారిటీ ఇచ్చేసాడు అజయ్ భూపతి. లేటెస్ట్ గా ఈ మూవీలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చేసింది. ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అజయ్ భూపతి మరోసారి పాయల్ రాజ్ పుత్ తో సినిమా చేస్తున్నాడు. మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్ షాక్ ఇచ్చే రేంజులో ఉంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ లో న్యూడ్ గా కనిపించింది. వెనక్కి తిరిగినట్లు ఉన్న పాయల్ రాజ్ పుట్ నడుము వరకూ అందాలని పోస్టర్ పై పరిచింది.

Read Also: Bandhavi: మసూద పాప మార్నింగ్ స్ట్రెచ్ తో మత్తెకిస్తుందే…

మోషన్ పోస్టర్ ని గుర్తు చేస్తూ పాయల్ రాజ్ పుట్ వేలు దగ్గర సీతాకోక చిలుక ఉంది. పోస్టర్ చూసిన వాళ్లందరూ ఆ చిలుక బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్లు ఏ చిలుకకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అనేది వాళ్లకి మాత్రమే తెలియాలి. పాయాల్ రాజ్ పుత్ ‘శైలజ’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విరుపాక్షకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజ్నీష్ లోకనాథ్, మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి  ఎలాంటి కథతో అజయ్ భూపతి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు? పాయల్ రోల్ ఆర్ ఎక్స్ 100ని మించి ఉంటుందా? యూత్ ని ఎంతవరకూ అట్రాక్ట్ చేస్తుంది అనే విషయాలకి సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version