Site icon NTV Telugu

Amazon : ‘కెజిఎఫ్ 2’, ‘సన్నాఫ్ ఇండియా’ ఒకటేనా..?

Son Of India

Son Of India

మంచు మోహన్ బాబు నటించిన తాజా చిత్రం సన్నాఫ్ ఇండియా.. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం విదితమే.. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు వసూళ్ళు వస్తాయని అందరూ భావించారు. కానీ కలెక్షన్ కింగ్ సినిమా మినిమమ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై సోషల్ మీడియా లో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.
ఇక ఈ సినిమా ఇటీవల ఓటిటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అమెరికాలో మాత్రం భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాను ఉచితంగా చూడలేరట.. సాధారణ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఈ సినిమాను చూసే అవకాశం లేదు. వినియోగదారులు ఆ సినిమా చూడాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం రెంట్ గా అయితే 3 డాలర్లు.. సినిమాని కొనాలంటే 10 డాలర్లు అదనంగా వసూలు చేస్తున్నారు.

ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఒక బ్లాక్ బస్టర్ మూవీలా రెంట్ కట్టి ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఏమైనా ఉందా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘కెజిఎఫ్ 2’ మాత్రమే అమెజాన్ లో పే ఫర్ వ్యూ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే కెజిఎఫ్ 2.. సన్నాఫ్ ఇండియా ఒక్కటేనా.. బ్లాక్ బస్టర్ మూవీ చూడడానికి డబ్బులు చెల్లించి.. డిజాస్టర్ మూవీ చూడడానికి కూడా డబ్బులు చెల్లించాలా..? అని నెటిజన్స్ మండిపడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రమే ఫ్రీ గా ఓటిటీ లో అడుగుపెట్టింది.. ఇది మరీ అన్యాయమని అమెరికా సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసమనే చెప్పాలి. ఇప్పటికే డిజాస్టర్ల సినిమాలను కొనుగోలు చేసి ట్రోల్స్ కు గురవుతున్న అమెజాన్.. ఇక వాటిని కూడా యూఏస్ జనాల కోసం రెంట్ టు వాచ్ మోడల్ లో స్ట్రీమింగ్ చేసి కొత్త ట్రోల్స్ కు ప్రైమ్ వీడియో తగినంత స్కోప్ ఇచ్చిందనే చెప్పాలి. మరి ఈ నిర్ణయంప అమెజాన్ మరోసారి ఆలోచిస్తే మంచిదని మరికొందరు అంటున్నారు.

Exit mobile version