LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ రొటీన్ లవ్ స్టోరీలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలే వస్తాయనుకుంటే పొరపాటే. సమాజంలో మరుగున పడిపోయిన చీకటి కోణాలను, ఎవరూ టచ్ చేయని సున్నితమైన అంశాలను ధైర్యంగా వెండితెరపై ఆవిష్కరించే సంచలన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహనిర్మాతగా ఆయన రూపొందించిన సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ बैటిల్” (LGBT – A Legal Battle). సమాజంలో గే, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న వివక్ష, వారి హక్కుల పోరాటం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన చిత్ర యూనిట్ మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో కేవలం ప్రొఫెషనల్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, నిజ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టులు కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ “మా హక్కుల కోసం మేము ఎన్నో ఏళ్లుగా రోడ్లెక్కి పోరాడుతున్నాం. కానీ మా బాధలను ప్రపంచానికి చెప్పే సరైన వేదిక దొరకలేదు. సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యలను అర్థం చేసుకుని ఈ సినిమా తీశారు. మేము ఇందులో నటన చేయలేదు, మా నిజ జీవితంలో మేము అనుభవించే నరకాన్ని, భావోద్వేగాలను అలాగే చూపించాం.” అన్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
గే కమ్యూనిటీ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ “తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు గే క్యారెక్టర్లను కేవలం జనాన్ని నవ్వించే ఒక జోకర్‌లాగా, కామెడీ కోసం మాత్రమే వాడారు. కానీ ఇతర భాషల్లో, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో వారి సమస్యలపై ఎంతో సీరియస్ సినిమాలు వచ్చాయి. తెలుగులో మొదటిసారి సునీల్ కుమార్ రెడ్డి గారు మాతో పాటు ట్రావెల్ చేసి, మా జీవితాలను దగ్గరగా చూసి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు.” అన్నారు. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ హిమ రాథోడ్ (హీరోయిన్) మాట్లాడుతూ.. ఈ సినిమాతో సమాజంలో తమపై ఉన్న అపోహలు, చూసే కోణం ఖచ్చితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తెరకెక్కించే క్రమంలో తాము సెన్సార్ పరంగా కూడా ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నామని సునీల్ కుమార్ రెడ్డి లీక్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం పూణే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ‘బెస్ట్ ఫిలిం అవార్డ్’ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!