పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’. సుజిత్ డైరెక్షన్ లో తెరెక్కిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయి పవర్ స్టార్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. కొన్నాళ్ళకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన OG అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లు, ఓటీటీలలో సంచలనం సృష్టించిన ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ ఈటీవీ భారీ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది.
దర్శకుడు సుజీత్ స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్, అలాగే ఎస్ఎస్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూపుదిద్దుకున్న OG మూవీ డిజిటల్ రైట్స్ ముందే ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అయినప్పటికీ శాటిలైట్ హక్కులు డీల్ క్లోజ్ కాలేదు. తాజాగా ఈటీవీ నెట్‌వర్క్ ఈ రైట్స్‌ను అధికారికంగా దక్కించుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈటీవీ నెట్‌వర్క్ చరిత్రలోనే ఒక భారీ పాన్-ఇండియా రేంజ్ యాక్షన్ ఫిల్మ్ రైట్స్ దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఈ టెలికాస్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. త్వరలోనే ఈటీవీలో ‘OG’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత, ఈటీవీ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని సొంతం చేసుకుంది. సుస్వాగతం సినిమా తర్వాత ఈటీవీ దక్కించుకున్న పవర్ స్టార్ రెండవ చిత్రం OG. బుల్లితెరపై ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రం టీఆర్‌పీ పరంగా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

