Site icon NTV Telugu

ఓజీ మూవీ చూసిన చిరు, చరణ్‌, మెగా హీరోలు

Mega Heros

Mega Heros

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు చాలా కాలం తర్వాత మంచి ట్రీట్ ఇచ్చింది ఈ మూవీ. ఇందులో పవన్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లు వసూలు చేసింది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. ఫ్యాన్స్ అయితే చాలా కాలం తర్వాత ఈ మూవీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Read Also : Peddi : రామ్ చరణ్‌ కు బ్యాడ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తాడా..?

అయితే తాజాగా మెగా హీరోలు ఈ సినిమాను చూశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ గా వేసిన షోకు పవన్ కల్యాణ్‌ తో పాటు చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్ చరణ్‌, వరుణ్‌ తేజ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా, ఆద్య, చిరంజీవి మనవరాళ్లు వచ్చారు. వీరితో పాటు అడవిశేష్, రాహుల్ రవీంద్రన్ , సుజీత్, థమన్ కూడా వీరితో పాటు ఉన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే సారి సినిమా చూడటం చాలా అరుదు. ఇప్పుడు ఓజీతో అది కుదిరింది.

Read Also : Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్

Exit mobile version