Site icon NTV Telugu

Pawan Kalyan: అది పవన్ వ్యక్తిత్వమంటే.. వీడియో వైరల్

Pawan

Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇక సినిమాలోనైనా.. రాజకీయాలల్లోనైనా పవన్ వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర” లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు.

ఇక దీంతో పోలీసులు ఎంత బందోబస్త్ పెట్టిన వారిని ఆపడం కష్టతరం అయ్యింది.  అయితే  ఈ నేపథ్యంలోనే పవన్ పోలీసుల బందోబస్త్ మధ్య వెళ్తుండగా జనసందోహం ఎక్కువ కావడంతో ఒక పోలీస్ అదుపుతప్పి పడిపోయాడు.. దీంతో వెంటనే పవన్ స్పందించి అంతమందిని దాటుకొని పోలీసును లేపి.. జాగ్రత్త చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై పవన్ అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అది పవన్ వ్యక్తిత్వమంటే.. అని కొందరు అంటుండగా.. అందుకే నువ్వు మాకు దేవుడు ఆయ్యవయ్యా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ  వీడియోను టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్ షేర్ చేస్తూ ఆ వ్యక్తిత్వం కు చప్పట్లు అంటూ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version