NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఆ సినిమాకి ముహూర్తం ఫిక్స్?

Pawan Harish Film

Pawan Harish Film

Pawan Kalyan To Start Harish Shankar Project By This Year End: ఈమధ్య పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొంచెం బిజీ అయిపోవడంతో.. ఆయన ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి. అసలు ‘హరి హర వీరమల్లు’ సినిమానే ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి, ఒప్పుకున్న మిగతా సినిమాలు ఇక జెండా ఎత్తేసినట్టేనని అంతా అనుకున్నారు. అటు ఎన్నికల కోసం కూడా కొన్ని నెలల ముందే బరిలోకి దిగాల్సి ఉంటుంది కాబట్టి.. ఒక్క హరి హర వీరమల్లుతోనే సర్దుబాటు చేసుకోవాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మిగతా సినిమాలు గగనమేనని, ముఖ్యంగా తామెంతో ఆశించిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా అటకెక్కినట్టేనని డిసైడ్ అయిపోయారు. కానీ.. ఆ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ ప్రాజెక్ట్‌ని ప్రారంభించాలని పవన్ నిర్ణయించుకున్నాడని సమాచారం.

ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. హరీశ్ శంకర్‌తో కమిట్ అయిన సినిమాను డిసెంబర్‌లో ప్రారంభించాలని పవన్ ఫిక్స్ అయ్యాడట. తానే దర్శకనిర్మాతలను పిలిచి.. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్టు తెలిసింది. తాను ఏయే సమయాల్లో ఖాళీగా ఉంటానన్న డేట్స్ ఇచ్చి, ఆ టైంలో షూటింగ్ ప్లాన్ చేయాలని కూడా పవన్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలతో కలిసి హరీశ్ శంకర్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడని.. డిసెంబర్‌ నెలలో మూడో వారం లేదా నాలుగో వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈసారి పవన్ ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా, చకచకా ప్రాజెక్ట్ పనులు నిర్వహించేలా చిత్రబృందం పక్కా స్కెచ్ వేసుకుందని వినికిడి. చిత్రీకరణను సైతం త్వరగా ముగించేలా టైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్‌సైడ్ న్యూస్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన రావొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు 2024లో జరుగుతాయి కాబట్టి.. 2023 చివరి వరకూ పవన్ కళ్యాణ్ ఫ్రీగానే ఉండనున్నాడు. అందుకే, ఆలోపు హరి హర వీరమల్లుతో పాటు హరీశ్ శంకర్ ప్రాజెక్ట్‌ని కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో, తిరిగి ఫీల్డ్‌లోకి దిగుతున్నాడని సమాచారం. మొత్తానికి.. పవన్, హరీశ్ కాంబోలో సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానుల కోరిక త్వరలోనే తీరబోతోందన్నమాట! ఇది పవన్ ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్తేనని చెప్పుకోవడంలో సందేహం లేదు.

Show comments