NTV Telugu Site icon

Pawan Kalyan: ఎట్టకేలకు ఆ సినిమాకి మోక్షం లభించనుంది…

Hari Hara

Hari Hara

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫాన్స్ అందరికీ OG, ఉస్తాద్, బ్రో సినిమాలు గుర్తొస్తాయి. వీటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తుండడంతో సోషల్ మీడియాలో కూడా ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల కన్నా చాలా ముందుగా, ఈ సినిమాల కన్నా భారీ బడ్జట్ తో సెట్స్ పైకి వెళ్లిన సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన తెలుగు వాడిగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. హ్యూజ్ సెటప్ లో హరిహర వీరమల్లు పర్ఫెక్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల్లో, పాలిటిక్స్ లో బిజీ అయిపోవడంతో ‘హరిహర వీరమల్లు’కి బ్రేక్ పడింది. OG, ఉస్తాద్ షూటింగ్ లకి పవన్ డేట్స్ ఇస్తున్నాడు కానీ హరిహర వీరమల్లు సినిమాని మాత్రం పట్టించుకోవట్లేదు అనే మాట వినిపిస్తోంది.

ఈ కామెంట్స్ ని ఎండ్ కార్డు వేస్తూ హరిహర వీరమల్లు సినిమాని మళ్లీ మొదలుపెట్టడానికి రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన భారీ సెట్లో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు దర్శకుడు క్రిష్. దాదాపు పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లని షూట్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు ఎంతవరకు షూటింగ్ జరుపుకుంది అనే విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Show comments