కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా కూడా పవన్ కళ్యాణ్ కి అన్న అంటే ఎంతో ఇష్టం. తనకి తెలిసిన ఒకే ఒక్క స్టార్ హీరో చిరంజీవి మాత్రమే అని ఎప్పుడూ చెప్పే పవన్ కళ్యాణ్, ఆగస్ట్ 22న చిరు బర్త్ డే కావడంతో ఒక ఓల్డ్ ఫోటోని పోస్ట్ చేసి విషెష్ చెప్పాడు.
Read Also: Sunny Deol: దంగల్ ని కూడా దాటిన గదర్ 2… నెక్స్ట్ టార్గెట్ KGF 2
చిరు కేక్ కట్ చేస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఈ రేర్ ఫోటోని మెగా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గత కొంత కాలంగా మెగా అభిమానులు విడిపోయారు… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్ వేరు వేరు అనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ అన్నకి దూరం అవ్వడు అనే మాటని నిజం చేస్తుంది పవన్ పోస్ట్ చేసిన ఫోటో. “అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు!” అని చెప్పిన మాటలో ఆ మెగా బ్రదర్స్ మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది.