NTV Telugu Site icon

Pawan Kalyan :అస్వస్థతకు లోనయ్యా.. ఆరోగ్య పరిస్థితిపై పవన్ ట్వీట్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Says he was not well in latest tweet: ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఆయన పూర్తిస్థాయిలో సినిమాల మీద కాకుండా రాజకీయాల మీదే ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే ఆయన వరుసగా ఏపీలో పర్యటనలు చేస్తున్నారు. నిన్నంతా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అక్కడే ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే ఈరోజు ఆయన తెనాలిలో వారాహి సభ నిర్వహించాల్సి ఉంది కానీ అస్వస్థత ఏర్పడడంతో ఆయన హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని జనసేన పార్టీ తరఫున ప్రకటించారు.

Adhurs Sequel: NTR ఇంటి ముందు నిరాహార దీక్ష చేసయినా సరే Adhurs 2 చేయిస్తా!

అయితే ఇదే విషయం మీద తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటాను అంటూ పవన్ కళ్యాణ్ తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తుంటే జనసేన కీలక నేతగా భావిస్తున్న నాదెండ్ల మనోహర్, తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ప్రచారం చేసేందుకు అదే నియోజకవర్గంలో వారాహి సభ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. అయితే వరుస పర్యటనల నేపథ్యంలో ఆయనకు జ్వరం వచ్చింది డాక్టర్ల సూచనల మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు.

Show comments