Site icon NTV Telugu

Pawan Kalyan : కొడుకు అగ్ని ప్రమాదంపై పవన్ కల్యాణ్‌ క్లారిటీ.. ..!

Pawankalyan

Pawankalyan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రమాదంపై పవన్ కల్యాణ్‌ ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. ‘నా కొడుకు సమ్మర్ క్యాంప్ కోసం వెళ్లాడు. అక్కడ చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపరితిత్తుల్లో కొంత సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతోది. ఇలాంటి సమయంలో ప్రతి తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ప్రమాదంలో ఓ పాప చనిపోయింది. అది నన్ను కలిచివేసింది. అరకు పర్యటన వల్ల నేను ఉదయమే వెళ్లలేకపోయాను. ప్రమాదం జరిగిన ప్రాంతంకు నా భార్య, పిల్లలు ఉన్న ప్రాంతం నుంచి 10 నిముషాల్లో చేరుకోవచ్చు. నా భార్యతో మాట్లాడాను. ఆమె డిప్రెషన్ లో ఉంది. ఏమీ చెప్పలేకపోతోంది. భగవంతుడి దయ వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు. నేను వెళ్లి చూసిన తర్వాత నాకు పూర్తి క్లారిటీ వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్‌.

Read Also : Manchu Manoj: నా కారు, ఇంట్లో వస్తువులు విష్ణు దొంగతనం చేశాడు!

‘నా కొడుకుకు ప్రమాదం జరిగిందని తెలిసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నా కొడుకు త్వరగా కోలుకోవాలంటూ కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరగా కోలుకోవాలంటూ విషెస్ చెప్పారు. వారందరికీ నా ప్రత్యేక ధన్యావాదాలు. మా అన్నయ్యలు చిరంజీవి, నాగబాబుతో పాటు నా కుటుంబ సభ్యలు అందరూ అండగా ఉన్నారు. ఈ విషయంపై నా కుటుంబ సభ్యులతో ఇంకా మాట్లాడలేదు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు సింగపూర్ వెళ్తాను. పూర్తి వివరాలు త్వరలోనే చెబతాను’ అంటూ తెలిపారు పవన్ కల్యాణ్‌.

Exit mobile version