NTV Telugu Site icon

Pawan Kalyan: మా దేవుడు నువ్వేనయ్యా.. పవన్ ఫోటోకి పూజలు చేసి నాట్లు!

Pawan Kalyan Pooja

Pawan Kalyan Pooja

Pawan Kalyan Photo Poooja at Ap Video Goes Viral: సాధారణంగా పొలంలో వరి నాట్లు వేసే ముందు తాము నమ్మి దేవి దేవతల ఫోటోలు పెట్టి పూజలు జరిపి ఆ తర్వాత నాట్లు వేయడం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయం రైతు బిడ్డలందరికీ తెలుసు. రైతు కూలీల బిడ్డలకి తెలిసే ఉండవచ్చు. అయితే దేవుడికి కాకుండా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఏపీలో ఒక రైతు పూజలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ కు కేవలం అభిమానులు మాత్రమే కాదు భక్తులు కూడా ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. పవర్ స్టార్ ట్యాగ్ తో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం.

TG Vishwa Prasad: మిస్టర్ బచ్చన్ వివాదం.. హరీష్ శంకర్ పై ట్వీట్ చేసిన టీజీ విశ్వప్రసాద్

అన్నతో పాటే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన పవన్ ప్రజారాజ్యం విలీనం తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. మళ్ళీ 2014లో జనసేన ఏర్పాటు చేసి అప్పటి బిజెపి తెలుగుదేశం కూటమికి మద్దతు పలికారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం, బీజేపీ నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆ రెండు పార్టీలకు దూరం జరిగారు. ఇక 2019లో స్వయంగా ఏపీలో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకున్నారు. ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా గెలవకపోవడంతో అనేక అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది 2024 లో మాత్రం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి భారీ విజయాన్ని సాధించి ఏకంగా 164 సీట్లు సాధించింది. అందులో ఒక్క జనసేనకే 21 ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

Show comments