తెలుగులో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికల్లో నేహా శెట్టి ఒకరు. ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన ‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, డీజే టిల్లులో ‘రాధిక’ పాత్రతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. ఆ రాధిక క్యారెక్టర్ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు, నేహా మరో పెద్ద అవకాశాన్ని అందుకుంది. తాజాగా జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా..
Also Read : Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
తాను పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘OG’లో భాగం అయినట్లుగా అధికారికంగా ధృవీకరించింది. పవన్‌తో కలిసి ఒక సర్‌ప్రైజ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నానని ఆమె చెప్పింది. అయితే అది స్పెషల్ సాంగ్ లోనా? లేక సినిమాలో చిన్న కానీ క్రేజీ రోల్ లోనా? అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ ఏదైనా అభిమానులకు మస్త్ సర్‌ప్రైజ్ అవుతుందని హింట్ ఇచ్చింది. ఇకపోతే, ఈ OG సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, ఇది పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ లుక్, యాక్షన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద హడావిడి సృష్టించాయి. ఈ నేపథ్యంలో నేహా ఎంట్రీ సినిమాకు అదనపు హైలైట్ కానుందని ఫిలిం నగర్ టాక్. ఇక నేహా శెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నందున, ఒక స్పెషల్ సాంగ్ అయినా, లేదా కేమియో రోల్ అయినా, ఆమె ప్రెజెన్స్ OGకి గ్లామర్ అడ్డ్ చేయబోతోంది. దీనికి ఉదాహరణగా, పూర్వం పవన్ నటించిన పంజాలోని “వెయ్యి రా చెయ్యి వెయ్యి రా” సాంగ్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహా క్రేజ్ ఇప్పుడు నేహా సాంగ్‌కి కూడా వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది.
