Site icon NTV Telugu

OG: మూడు నెలల్లో 50 రోజుల షూటింగ్ చేసారా… అరాచకం

Arjun Das In Og

Arjun Das In Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘OG’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరెట్ హీరోని ఏ రేంజులో చూపిస్తాడో అనే ఆలోచనతో ఫాన్స్ ‘OG’పై ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఈ మూవీపై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు OG విషయంలో ఏం జరుగుతుంది, ఎంతవరకు షూటింగ్ అయ్యింది అనేది ఫాన్స్ కి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. జనవరిలో అఫీషియల్ గా అనౌన్స్ అయిన OG, ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న OG అక్కడ ఒక ఫైట్ అండ్ ఒక సాంగ్ షూట్ జరుపుకుంది. హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ కూడా ముంబై షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్ అయిపోగానే టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా OG గురించి మరో అప్డేట్ ఇచ్చారు.

OG లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సమయంలో “50 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసాం” అంటూ ట్వీట్ చేసారు. ఏప్రిల్, మే, జూన్… జులై మిడ్ మంత్ కి 50 రోజుల షూటింగ్ కంప్లీట్ చేయడం అంటే మాటలు కాదు. పొలిటికల్ కమిట్మెంట్స్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సుజిత్ ఈ స్పీడ్ లో సినిమా చేస్తుండడం గొప్ప విషయమే. ఇంత స్పీడ్ గా, ఇంత యాక్టివ్ గా ఈ మధ్య కాలంలో ఏ ప్రొడక్షన్ హౌజ్ కూడా ఫాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ విషయంలో పవన్ ఫాన్స్ డీవీవీ బ్యానర్ పై కాంప్లిమెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. డీవీవీ నుంచి ట్వీట్ రావడంతో సోషల్ మీడియాలో OG టాగ్ ట్రెండ్ అవుతోంది. ఇలా అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రమోట్ చెయ్యడం వలన సినిమాకి మంచి బజ్ వస్తుంది, ఎక్కువ రోజు జనాల్లో ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంటుంది, బిజినెస్ త్వరగా అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోని ఇతర దర్శక నిర్మాతలు హీరోలు కూడా తమ సినిమాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేస్తే ఇప్పుడు పెడుతున్న మితిమీరిన బడ్జట్ లని చాలా వరకూ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Exit mobile version