పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ రీరిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్ కి క్యు కట్టారు. ఈ మూవీ రీరిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చేసి, కలెక్షన్స్ లో కొత్త హోస్తోరి క్రియేట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ మరోసారి రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరోగా నిలబెట్టిన ‘తొలిప్రేమ’, ‘బద్రీ’ సినిమాలు శివరాత్రి పండగ సంధర్భంగా రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యాయి. మెగా అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఈ రెండు సినిమాల రీరిలీజ్ తో ఖుషి సినిమా రికార్డులని బ్రేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి షాక్ ఇచ్చాడు మెగాస్టార్. మెగాస్టార్ నటించిన పర్ఫెక్ట్ కమర్షియల్ సూపర్ హిట్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది.
అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీని ఫిబ్రవరి 17న రీరిలీజ్ చేస్తున్నారు. 4K వెర్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. దీంతో అన్నయ సినిమా వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలని రీరిలీజ్ చెయ్యడానికి బ్రేక్ ఇచ్చారు. బద్రీ, తొలిప్రేమ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు కనుక మెగా అభిమానులు అంతా ఫిబ్రవరి 17న గ్యాంగ్ లీడర్ సినిమాని చూడడానికి వెళ్లిపోతారు. శివరాత్రి జాగారం మెగా సినిమాతో ఎంజాయ్ చెయ్యడానికి ఫాన్స్ ఫిక్స్ అయిపోవడంతో రీరిలీజ్ బాక్సాఫీస్ ట్రెండ్ కి ఒక కొత్త బెంచ్ ఫిబ్రవరి 18న సెట్ అవ్వడం గ్యారెంటీ. మరి ఖుషి సినిమాతో తమ్ముడు పవన్ కళ్యాణ్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని గ్యాంగ్ లీడర్ సినిమాతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ చేస్తాడో లేదో తెలియాలి అంటే ఫెబ్ 18th వరకూ ఆగాల్సిందే.
