పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “హరిహర వీర మల్లు”. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత వాయిదా పడ్డ “హరిహర వీర మల్లు” షూటింగ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతోంది. “భీమ్లా నాయక్”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు పూర్తిగా ఈ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభం కానుంది.
Read Also : Mahesh Babu : సెమీ ఫార్మల్ లో ఛార్మింగ్ లుక్… సూపర్ స్టార్ పిక్స్ వైరల్
అయితే ఇప్పుడు నెట్టింట్లో పవన్ యాక్షన్ మోడ్ లో ఉన్న పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ పిక్ లో పవన్ సరికొత్త లుక్ లో, ఫిట్ గా కన్పిస్తున్నారు. ఈ పిక్ చూస్తుంటే భారీ యాక్షన్ సన్నివేశాలకు రంగం సిద్ధమైనట్లు కన్పిస్తోంది. స్టంట్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ప్రాక్టీసు మొదలెట్టాడు పవన్. టోడోర్ లాజరోవ్ అనే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సారధ్యంలో “హరిహర వీర మల్లు” హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను రిహార్సల్స్ చేస్తున్నారు పవన్. ఏప్రిల్ 8 నుంచి షూటింగ్ రీస్టార్ట్ కానుంది. కాగా “హరిహర వీర మల్లు” చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ “వినోదయ సీతం” తెలుగు రీమేక్ పై దృష్టి పెట్టనున్నారు. ఇక “హరిహర వీర మల్లు” ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.
