Site icon NTV Telugu

Hari Hara Veeramallu: తోట తరణికి పవన్ కళ్యాణ్ హార్ధిక స్వాగతం!

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ప్రముఖ కళాదర్శకులు ‘పద్మశ్రీ’ తోట తరణి కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం తోట తరణి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న తరణి గారి నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన రూపొందించే సెట్స్ సృజనాత్మక శక్తికి… అధ్యయన అభిలాషకు అద్దం పడతాయన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తరణి గారితో పరిచయం ఉందన్నారు.

Hari Hara Veeramallu 1

Hari Hara Veeramallu 2

Exit mobile version