రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో ట్రెమండస్ బుకింగ్స్ ని రాబడుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది సలార్ మూవీ. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ సలార్ మేనియా కొనసాగుతుంటే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OGని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. బుకింగ్స్ లో కలెక్షన్స్ లో OG కొత్త రికార్డులు పుట్టిస్తాం అంటూ పవన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.
పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అనౌన్స్మెంట్ నుంచే పంజా వైబ్స్ ఇస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ షేప్ షకల్ మారిపోవడం గ్యారెంటీ. టీజర్ తోనే రచ్చ లేపిన ఈ హంగ్రీ చీతాకి సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ కూడా బయటకి వస్తే OG హైప్ ఆకాశాన్ని తాకుతుంది. అప్పుడు మొదటి సండే కంప్లీట్ అయ్యే లోపే OG బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేయడం పక్కా. హ్యుజ్ ప్రీ బుకింగ్స్ తో ప్రీమియర్స్ నుంచే OG కొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేయడం గ్యారెంటీ.
