Site icon NTV Telugu

NBK X PK: నిప్పుకొండ, నిలువెత్తు రాజసం… కలిస్తే చరిత్ర తిరగ రాయడం ఖాయం…

Nbk X Pk Copy

Nbk X Pk Copy

గ్లోబల్ స్టార్ ప్రభాస్ వచ్చినప్పుడు తెలుగు ఒటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ క్రాష్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఆహా విషయంలో జరగబోతోంది. అప్పుడు గెస్ట్ ప్రభాస్ అయితే ఈసారి గెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మాటల తూటాలు పెలాల్సిందే అంటూ ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రేజీ ఎపిసోడ్ ని రెడీ అవ్వండి అంటూ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి స్టేజ్ పైకి వచ్చి నిలబడే వరకూ ఉన్న ఈ గ్లిమ్ప్స్ లో బాలయ్య ఒక చిన్న డైలాగ్ తో పవన్ కళ్యాణ్ ని ఫుల్ గా నవ్వించేసాడు.

Read Also: NTR 30: సర్ ఇంతకీ ఎప్పుడు వస్తారు?

అన్-స్టాపబుల్ సీజన్ 2కి క్లోజింగ్ ఎపిసోడ్ గా త్వరలో స్ట్రీమ్ అవ్వనున్న ఈ ఎపిసోడ్ దెబ్బకి ఆహా షేక్ అవ్వడం గ్యారెంటి. కొంచెం ఫన్, కొంచెం పాలిటిక్స్, కొంచెం పర్సనల్ ఇలా పవన్ కళ్యాణ్ ని సంబంధించిన అన్ని విషయాలని బాలయ్య ఆడియన్స్ కి తెలిసేలా చెయ్యబోతున్నాడట. ఒక టాక్ షో హిస్టరీలోనే ముందెన్నడూ లేని రికార్డ్స్ ని క్రియేట్ చేసిన అన్ స్టాపబుల్ షో సీజన్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఎండ్ అయిపోతే మరి సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాని అప్డేట్ ఎప్పుడు ఇస్తారు? సీజన్ 3 ఉంటుందా లేక ఇక్కడితో బాలయ్య టాక్ షోకి ఎండ్ కార్డ్ పడుతుందా అనేది తెలియాలి అంటే ఈ బాలయ్య-పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

https://www.youtube.com/watch?v=fBEJBi2m90g

 

Exit mobile version