సంక్రాంతి, శివరాత్రి, దసరా, దీపావళి పండగలని ఎంత గొప్పగా చేసుకుంటారో అంతే గొప్పగా పవన్ సినిమా రిలీజ్ రోజుని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫాన్స్. ఆయన ఫాన్స్ కాకుండా కల్ట్స్ ఉంటారు అనే మాట వినిపించడానికి ఇది కూడా ఒక కారణమే. పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు, ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయాలతో సంబంధం లేకుండా పవన్ నుంచి సినిమా వస్తే చాలు అనుకునే ఫాన్స్… రిలీజ్ రోజున థియేటర్స్ దగ్గర హంగామా చేయడమే కాదు, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రతి పవన్ సినిమా డే 1 రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ కలెక్షన్స్ కి ఇంకాస్త పెంచుకోవడానికి ప్రొడ్యూసర్స్ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తారు. ఆ టైంలో అప్పటివరకూ ఉన్న ప్రతి పాత రికార్డ్ చెల్లా చెదురు అవుతుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న ప్రతి ప్రొడ్యూసర్ కి తెలుసు అందుకే ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తారు. ఈసారి మాత్రం పవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’ విషయంలో అలా జరగట్లేదు.
సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కలిసి నటించిన మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. రీఎంట్రీ తర్వాత పవన్ నుంచి వస్తున్న మూడో రీమేక్ చిత్రమిది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత ‘బ్రో’ రీమేక్‌తో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు పవర్ స్టార్. రీమేక్ కాబట్టి ఎంత ప్రమోట్ చేసినా బజ్ రావట్లేదని కొంతమంది అనుకుంటున్నారు కానీ నిజంగానే బ్రో సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరగట్లేదు. ఇటీవలే రిలీజ్ అయిన జాణవులే సాంగ్ కూడా సో సోగానే రెస్పాన్స్ రాబట్టింది. బ్రో ట్రైలర్ అండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లు మాత్రమే ఇక బజ్ జనరేట్ చేయగల లాస్ట్ లెగ్ ప్రమోషనల్ కంటెంట్స్. ఈ రెండు హైప్ పెంచితే బ్రో సినిమా ఓపెనింగ్ డే సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. అందుకే మేకర్స్ హైప్ పెంచడానికి ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. జూలై 21న అంటే శుక్రవారం రోజు బ్రో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ విషయాన్ని కన్ఫర్ చేశారు. దీంతో ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. ఇక ప్రమోషన్స్‌ను మరింత స్పీడప్ చేయనున్న మేకర్స్… బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూలై 25న హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.