Site icon NTV Telugu

Pawan Kalyan : నా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నా ఛాంబర్ ద్వారానే రావాలి..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : థియేటర్ల మూసివేత అంశంపై పెద్ద రగడ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై పవన్ కల్యాణ్‌ సీరియస్ గా స్పందించారు. దానిపై ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు కూడా తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. పవన్ కల్యాణ్‌ కే మద్దతు పలికారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మరోసారి ఘాటుగా స్పందించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తాజాగా పవన్ కల్యాణ్‌ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలను చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు, వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సినిమా టికెట్ల ధరల పెంపుకోసం వ్యక్తిగతం రావొద్దని తేల్చి చెప్పారు.

Read Also : Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్.. జనసేన నేతకు పవన్ షాక్?

‘నా సినిమా టికెట్ ధరల పెంపుకోసం అయినా సరే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే రావాలి. ఇక నుంచి ఎవరూ వ్యక్తిగతంగా రావొద్దు. అలా వస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఐక్యత పెరుగుతుంది. హరిహరి వీరమల్లు సినిమాకు అయినా సరే నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే రావాలి. మండలి ద్వారానే వచ్చి అర్జీ పెట్టి సంప్రదింపులు జరపాలి. అంతే గానీ తనమన అనే బేధాలు పాటించొద్దు. ఇక నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు అందరూ సమానమే. నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర మండలి ద్వారా వస్తేనే అందరికీ సమాన న్యాయం జరుగుతుంది.

ఇందులో ఎలాంటి తారతమ్యాలు లేవు. అందరూ మనకు సమానమే. ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి బేధాలు మేము చూపించలేదు. కాబట్టి ప్రభుత్వంతో అందరూ అలాగే బిహేవ్ చేస్తే బెటర్. టికెట్ల ధరల పెంపుపై కూడా పునరాలోచనలు చేస్తాం. ఎలా పడితే అలా పెంచకుండా ఒక నిర్దిష్ట స్థాయిలోనే ధరలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాం’ అంటూ తెలిపారు పవన్ కల్యాణ్‌.

Read Also : Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో?

Exit mobile version