NTV Telugu Site icon

Ustaad Bhagath Singh: ఫుల్ స్వింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీప్రొడక్షన్ వర్క్స్…

Ustaad Bhagath Singh

Ustaad Bhagath Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేవార్ బిఫోర్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేసి, పవన్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం పుష్కర కాలంగా మెగా అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ‘భవధీయుడు భగత్ సింగ్’ అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని పేరు మారుస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీతో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని పవన్ ఫాన్స్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

పవన్ అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయో సరిగ్గా తెలిసిన దర్శకుడు కాబట్టే హరీష్ శంకర్, అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఎన్నికల తర్వాతే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ అందరికీ స్వీట్ షాక్ ఇస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టిన హరీష్ శంకర్, ఇటివలే ఆర్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఒక కాన్సెప్ట్ విజువలైజేషణ్స్ గురించి డిస్కస్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి అని అనౌన్స్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ హరీష్ శంకర్ మరియు ఆనంద్ సాయి డిస్కస్ చేసుకుంటున్న ఫోటోలని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాతే సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడంతో అందరూ షాక్ అవుతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మిలియన్ డాలర్ క్వేషన్ అనే చెప్పాలి.