NTV Telugu Site icon

Pavithra Gowda: పోలీసు కస్టడీలో కూడా మేకప్ తో పవిత్ర గౌడ.. అడ్డంగా బుక్కైన పోలీసులు!

Pavithra Gowda Makeup

Pavithra Gowda Makeup

Pavithra Gowda Makeup Controversy : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, నటి పవిత్ర గౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పవిత్ర గౌడను 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. అక్కడ విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మీడియాలో ఈ అంశం హైలైట్ కావడంతో ఇందుకు సంబంధించి ఓ మహిళా పీఎస్‌ఐకి మెమో కూడా ఇచ్చారు. హత్యకేసులో నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగా మేకప్ వేసుకుంది. పెదవులకు లిప్ స్టిక్ రాసుకుని మేకప్ వేసుకుంది. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్ వేసుకున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేశాయి. పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ కాస్మోటిక్స్ ఉపయోగించి మేకప్ చేసుకునేందుకు మహిళా పోలీసుల సహకరించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల అదుపులో ఉన్న పవిత్రగౌడ్‌ను రాత్రి మడివాల సాంత్వన కేంద్రంలో ఉంచేవారు. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్‌లోని మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.

Prabhas Fan: ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్.. షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్!

అయితే పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ కాస్మోటిక్స్ వాడినట్లు వచ్చిన వార్తలను సీరియస్‌గా తీసుకున్న డీసీపీ గిరీష్.. హత్యకేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్‌స్టిక్‌తో పాటు కాస్మోటిక్స్‌ను ఎలా వాడేందుకు అనుమతించారో వివరించాలని మహిళా పీఎస్‌ఐకి మెమో ఇచ్చారు. కానీ ఈ మెమోకు ఇప్పటి వరకు పీఎస్‌ఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెబుతున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. ప్రతిరోజు పవిత్రగౌడ్‌ను మడివాలలోని మహిళా కేంద్రం నుంచి అక్కడికి తీసుకొచ్చి మళ్లీ రాత్రికి తీసుకెళ్లారు. అక్కడ, ఆమె కుటుంబం పవిత్ర కోసం బట్టలు, లిప్ స్టిక్ సహా మేకప్ వస్తువులు తెచ్చి ఉండవచ్చు. పవిత్ర బట్టలు మార్చుకునే సమయంలో లిప్ స్టిక్ వేసుకుని విచారణకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మంగళవారం (జూన్ 25) పరప్పన అగ్రహార జైలులో ఆమెను కలిశారు. పవిత్రగౌడ్ తల్లి, సోదరుడు, కూతురు జైలుకు వచ్చి ఆమెతో మాట్లాడారు.