NTV Telugu Site icon

Pavani Reddy: ప్రెగ్నెంట్ అయ్యా.. అందుకే సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నా.. ఇంకా..?

Pawani

Pawani

Pavani Reddy: కోలీవుడ్ నటి పావని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా పావని తెలుగమ్మాయే అయినా.. తమిళ్ లో సెటిల్ అయ్యింది. ఇక్కడ చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించిన పావని, సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది. ఎంతో ఆనందంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన పావనికి దేవుడు అంధకారాన్ని మిగిల్చాడు. కొన్ని కారణాల వలన ప్రదీప్ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఇక భర్త మరణంతో కృంగిపోయిన పావని.. తెలుగుకు బైబై చెప్పి .. తమిళ్ లో సెటిల్ అయ్యింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తమిళ్ బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్లి తన భయాలను పోగొట్టుకొని వచ్చింది. ఇక ఆ బిగ్ బాస్ ఇంట్లోనే తన కో కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ అమీర్ ప్రేమలో పడింది. ఈ జంట.. ఈ మధ్య రిలీజ్ అయిన అజిత్ తెగింపు చిత్రంలో ప్రేమ పక్షులుగా కూడా కనిపించారు. బిగ్ బాస్ స్టేజి మీదనే తాము నిజజీవితంలో కూడా జోడిగా ఉండబోతున్నామని ప్రకటించారు. అంతేకాకుండా అమీర్ ను చూస్తే ప్రదీప్ తిరిగి బతికివచ్చినట్లు ఉందని పావని చెప్పుకొచ్చింది.

Chiranjeevi: కొడుకు విషయంలో అలా చేసినా.. బన్నీని ఆకాశానికెత్తిన చిరు

ప్రస్తుతం ఈ జంట చెన్నెలో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు పావని షాకింగ్ రిప్లై ఇచ్చి కోలీవుడ్ ను షేక్ చేసింది. “మేడమ్.. మీకు, అమీర్ కు పెళ్లి అయిపోయిందటగా.. అభిమానులకు ఎప్పుడు చెప్తారు.. ఎందుకు ఇన్నిరోజులు దాచిపెడుతున్నారు” అన్న ప్రశ్నకు.. పావని ఘాటుగా సమాధానం చెప్పింది. ” అవునునేను నిన్న ప్రెగ్నెంట్ ను కూడా అయ్యాను.. ఆ తరువాత మాకు బ్రేకప్ కూడా అయ్యింది.. మళ్లీ సీక్రెట్ గా మేము పెళ్లి చేసుకున్నాం.. ఇంకా.. ఇంకా అడగండి. ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరికి వారు ఊహించేసుకొని అనేస్తున్నారుగా.. ఇంకేమైనా ఉంటే చెప్పండి.. ఇంకేం కహానీలు ఉన్నాయి” అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం పావని రెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments