సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ ఎంటటైనర్ “డిజె టిల్లు”. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి సిద్ధు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్ కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి రేసులో సినిమా ఉంటుందని ముందుగా ప్రకటించిన చిత్రబృందం ఆ తరువాత మనసు మార్చుకుంది. దీంతో ‘డీజే టిల్లు’ ఈ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ‘డీజే టిల్లు’లోని రెండవ పాట “పటాస్ పిల్ల” ఈరోజు విడుదలైంది. శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ పాటను సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. కిట్టు విస్సప్రగడ చక్కని సాహిత్యం రాశారు. అలాగే ఇందులోని మాస్ బీట్ కూడా వినసొంపుగా ఉంది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది.
Read also : సమంత లైఫ్ లో మ్యాజిక్… కొత్త పిక్ తో రివీల్ !!
