NTV Telugu Site icon

Parvati Melton: ‘జల్సా’ లో పవన్ హీరోయిన్ ఏంటీ ఇంతలా మారిపోయింది..

Parvati

Parvati

Parvati Meltan: పార్వతి మెల్టాన్.. ఈ పేరు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు.. అదే ‘వెన్నెల’ హీరోయిన్ అని చెప్పండి టక్కున గుర్తొచ్చేస్తోంది. అరే ఇంకా గుర్తు రాలేదా.. ‘జల్సా’లో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ పవన్ పాడింది అమ్మడి కోసమే.. ‘దూకుడు’ లో మహేష్ తో పాటు పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ గంతులు వేసింది ఈ ముద్దుగుమ్మనే. ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికి గుర్తొచ్చే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో అగ్గిరాజేసింది. బీచ్ లో బికినీ ఫోటోషూట్ తో రచ్చ లేపింది.

ఒక్కసారిగా ఆమెను చూసినవారందరు షాక్ అవ్వక మానరు. టాలీవుడ్ లో అతి పొడుగున్న హీరోయిన్లలలో పార్వతి మెల్టాన్ ఒకరు.. ఈ పొడుగు సుందరి ఇన్నిరోజులకు బికినీ లో దర్శనమిచ్చింది. ఇసుక తిన్నెల్లో పూల పూల బికినిలో పార్వతి హాట్ లుక్స్ సెగలు పుట్టిస్తున్నాయి. అమ్మడు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికే అదే సౌందర్యంతో మెరిసిపోతోంది. అయితే ఇంత గ్యాప్ తరువాత పార్వతి అందాల ఆరబోతకు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రీ ఎంట్రీ కోసం చిన్నది ఇలాంటి అందాల ఆరబోత చేస్తుందా..? అంటే.. అందులోనూ నిజం లేకపోలేదు అన్నది అభిమానుల వాదన. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తాను ఎలాంటి పాత్రలకైనా రెడీ అని ఈ ఫోటోషూట్ తో చెప్పకనే చెప్తోంది అని అంటున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ముద్దుగుమ్మ ఎలాంటి ఆఫర్లు అందుకుంటుందో చూడాలి.

Show comments