Paruchuri Gopala Krishna: మొదట్లో ‘ఇంద్ర’ వద్దన్నారు.. తర్వాత అలా సెట్టయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paruchuri Gopala Krishna Recalls Indra Movie Days: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. థియేట్రికల్ రన్, కలెక్షన్ల పరంగా ఆ చిత్రం ఎన్నో రికార్డుల్ని నమోదు చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఓ చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి సినిమాను మొదట చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ నిర్ణయించుకున్నారట. నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ చిత్రం చేసేందుకు సముఖత వ్యక్తం చేయలేదట! చివరికి తాను జోక్యం చేసుకోవడంతో, ఈ సినిమా కార్యరూపం దాల్చుకుందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ‘ఇంద్ర’ సినిమా వచ్చి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆయన ఈ చిత్రం కోసం కొన్ని విశేషాలను తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నారు.
‘‘ఇంద్ర సినిమా చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ మొదట్లో అనుకున్నారు. అందుకు కారణం.. ఆయన తెరకెక్కించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్రని ఇంద్ర రోల్ పోలి ఉండటమే! కాబట్టి.. మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని దర్శకుడు భయపడ్డాడే తప్ప, కథ బాలేదని వెనకడుగు వేయలేదు. ఆయనతో పాటు నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పుడు నేను చిరంజీవి ఓ అద్భుతమైన సినిమా మిస్ అయిపోతున్నారే.. అని బాధపడ్డా. అయితే.. ఈ సినిమా విషయం చిరంజీవికి చెప్పాను. అప్పుడాయన గోపాల్ అశ్వినీదత్ లేకుండానే, చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్తున్నప్పుడు.. ఇంటర్వెల్ వరకూ విని, లేచి కిళ్లీ వేసుకొని వచ్చారు. ‘సెకండాఫ్ వినక్కర్లేదు, ఇది హిట్ అవుతుంది’ అని చిరంజీవి అన్నారు. కథ పూర్తయ్యేసరికి.. పక్క గదిలో నుంచి అశ్వినీదత్, బీ. గోపాల్ వచ్చారు. అందరం కలిసి చేద్దామన్నారు. అలా ఈ సినిమా సెట్ అయ్యింది’’ అని నాటిరోజుల్ని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
అంతేకాదు.. తనకు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి పోషించిన పాత్ర ఆఫర్ వచ్చిందని, కానీ మోకాలి నొప్పి కారణంగా అంత దూరం ప్రయాణం చేయలేక తానే వదిలేసుకున్నానని గోపాలకృష్ణ తెలిపారు. అలాగే డైలాగ్స్ రైటర్ అయిన తాను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అని ఆలోచించుకొని, మూగపాత్ర ఎందుకులే అని చేయలేదని అన్నారు. అలా తాను ఇంద్రలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం చేజార్చుకున్నానన్నారు. ఆ సినిమాలో తాము రాసిన ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ఇప్పటికీ మారిమోగిపోతూనే ఉందని, అది తనకు చాలా సంతోషకరంగా అనిపిస్తుందని పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!