NTV Telugu Site icon

First Look Poster: ఆసక్తి రేకెత్తిస్తున్న శ్రద్ధా పర్వం!

Parijatha

Parijatha

Shradha Das: వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద క్యూరియాసిటీని పెంచుతోంది. బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ‘పారిజాత పర్వం’ మూవీకి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా, ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అనంత సాయి సహ నిర్మాత. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ తదితరులు పోషించారు.
Parijatha1
శ్రద్ధాదాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి నుండి గ్లామర్ షోకు సై అంటున్న శ్రద్ధదాస్ ఘన విజయాలను సొంతం చేసుకోకపోయినా… తనదైన ముద్రను టాలీవుడ్ పై వేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటించి మెప్పించింది. ఇక సునీల్ రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. కమెడియన్ గా, హీరోగా వచ్చిన గుర్తింపును మించి ప్రతినాయకుడిగా సునీల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాలలో సునీల్ విలన్ పాత్రలు పోషిస్తుండటం విశేషం. ‘పారిజాత పర్వం’లో కీలక పాత్ర పోషిస్తున్న చైతన్యరావు వెబ్ సీరిస్ లతో పాటు ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ హీరోగా నటిస్తున్నాడు. మాళవిక సతీశన్ సైతం తెలుగులో తన ప్రతిభను చాటుకుంటోంది. ఈ మధ్యే ఆమె కథానాయికగా నటించిన ‘దోచేవారెవరురా’ మూవీ విడుదలైంది. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వస్తున్న ‘పారిజాత పర్వం’ ఎలా ఉంటుందో చూడాలి.

Show comments