NTV Telugu Site icon

Disney Hotstar: త్వరలో ‘పరంపర’ 2 వెబ్ సిరీస్!

Parmpara

Parmpara

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ త్వరలో సెకండ్ సీజన్ కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. గతేడాది స్ట్రీమింగ్ అయిన దీనికి ప్రేక్షకుల నుంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది.

వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంగా ‘పరంపర’ రూపొందింది. యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఐదు సినిమాలకు సరిపోయే స్టఫ్ ఉందన్న ఈ పేరు వెబ్ సిరీస్ కు వచ్చింది. ఇంతే స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఉండబోతోందని ప్రొడక్ష్ హౌస్ వెల్లడించింది. త్వరలోనే ‘పరంపర’ సీజన్ 2 డీటెయిల్స్ వెల్లడిస్తామని టీమ్ చెప్పారు.

Show comments