Site icon NTV Telugu

Parada : అనుపమ పరదా’ స్పెషల్ ప్రీమియర్స్ ఫిక్స్.. బుకింగ్స్ షురూ..!

Paradha

Paradha

టాలీవుడ్‌లో ఎప్పుడూ కొత్త కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ప్రేక్షకుల దగ్గర మంచి గుర్తింపు పొందుతుంటాయి. అందులో భాగంగా, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పరదా’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఎంటర్‌టైన్ చేయడమే కాకుండా ఒక బలమైన సోషల్ మెసేజ్‌ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు లేదా, లవ్ స్టోరీలు ఎక్కువగా చేసే అనుపమ ఈసారి సీరియస్ కాన్సెప్ట్ ఉన్న సినిమా‌తో రాబోతోందనే అంశం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక

Also Read : Girija Shettar : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గీతాంజలి హీరోయిన్..

సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండగానే మేకర్స్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అనుపమ అభిమానులు, సినిమా లవర్స్ భారీ ఎత్తున స్పందిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ‌తో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా అయితే ఈ చిత్రం ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version