Site icon NTV Telugu

కొండపొలం ట్రైలర్: అనుకున్న టైమ్‌కే వచ్చేస్తున్నారు

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘కొండపొలం’.. బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలై ఓబులమ్మ పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. కాగా, ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలకు దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ట్రైలర్ అప్డేట్ తో పుకార్లకు చెక్ పెట్టారు.

ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల చేస్తామంటూ క్రిష్ పోస్ట్ చేశారు. ఓ అద్భుతమైన ప్రేమ కథను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో పాటే ఈ సినిమా విడుదల తేదీని, ఇదివరకు అనౌన్స్ చేసిన తేదీనే (అక్టోబర్ 8) ప్రకటించే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

Exit mobile version